టాప్ సెలబ్రిటీలు హోస్టులుగా వ్యవహరించడం… 100 రోజుల పాటు ఒకరికి మరొకరితో పరిచయం లేని వ్యక్తులు ఒకే ఇంట్లో గడపడం.. వాళ్ల మధ్య గొడవలు, సంతోషాలు, ఆనందాలు.. అన్నీ కెమెరాలో రికార్డ్ అవడం.. లాంటి విషయాలు ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి.
బిగ్ బాస్.. టెలివిజన్ రంగంలోనే ఈ షో ఓ సంచలనం. బిగ్ బాస్ రియాలిటీ షో.. ఏ భాషలో వచ్చినా.. సూపర్ సక్సెస్ అయింది. ఆ భాష.. ఈ భాష అని లేకుండా.. అన్ని భాషల ప్రేక్షకులు బిగ్ బాష్ షోను ఆదరించారు. మన దేశంలో మాత్రం ముందుగా హిందీలో ఈ షో ప్రారంభం అయింది. ఇప్పటి వరకు హిందీలో 12 సీజన్లను పూర్తి చేసుకుంది.
దాని తర్వాత ఇతర భాషల్లోనూ ఇది ప్రారంభం అయింది. టాప్ సెలబ్రిటీలు హోస్టులుగా వ్యవహరించడం… 100 రోజుల పాటు ఒకరికి మరొకరితో పరిచయం లేని వ్యక్తులు ఒకే ఇంట్లో గడపడం.. వాళ్ల మధ్య గొడవలు, సంతోషాలు, ఆనందాలు.. అన్నీ కెమెరాలో రికార్డ్ అవడం.. లాంటి విషయాలు ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి.
అయితే… ఇప్పటి వరకు అన్ని భాషల్లో వచ్చిన బిగ్ బాస్ సీజన్ల విజేతలు ఎవరో తెలుసుకుందాం.
ముందుగా హిందీలో విజేతలుగా నిలిచిన వాళ్ల గురించి తెలుసుకుందాం. హిందీలో జరిగిన 12 సీజన్లలో 12 మంది విజేతలు ఎవరంటే..
-
- Bigg Boss Season 1 Winner – రాహుల్ రాయ్
- Bigg Boss Season 2 Winner -ఆశుతోష్ కౌశిక్
- Bigg Boss Season 3 Winner – విందు దారాసింగ్
- Bigg Boss Season 4 Winner – శ్వేతా తివారీ
- Bigg Boss Season 5 Winner – జుహి పార్మర్
- Bigg Boss Season 6 Winner – ఊర్వశీ ఢొలాకియా
- Bigg Boss Season 7 Winner – గౌహర్ ఖాన్గౌ
- Bigg Boss Season 8 Winner – తమ్ గులాటి
- Bigg Boss Season 9 Winner – ప్రిన్స్ నారులా
- Bigg Boss Season 10 Winner – మన్వీర్ గుర్జార్చి
- Bigg Boss Season 11 Winner – శిల్పా షిండే
- Bigg Boss Season 12 Winner – దీపికా కకర్
ఇక తెలుగు షో కు వస్తే… తెలుగులో ఇప్పటి వరకు రెండు సీజన్లు మాత్రమే పూర్తయ్యాయి. వాటిలో మొదటి సీజన్ లో శివ బాలాజీ విన్నర్ కాగా.. రెండో సీజన్ కు కౌశల్ మండ విన్నర్ గా నిలిచాడు.