హిందీ ట్రాన్స్‌లేటర్లకు పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ తాజాగా ఆయా విభాగాల్లో ఏర్పడిన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కింద మొత్తం 283 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు…
* మొత్తం ఖాళీలు: 283 (గ్రూప్ బీ నాన్ గెజిటెడ్)
* పోస్టులవారీగా ఖాళీలు: జూనియర్ ట్రాన్స్‌లేటర్/ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ – 275, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ - 8
* అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
* వయస్సు: 2021 జనవరి 1 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి
* ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (రెండు పేపర్లు) ద్వారా
* పరీక్ష తేదీలు: పేపర్-1: 2020, అక్టోబర్ 6, పేపర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్)-2021, జనవరి 31
* దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
* చివరితేదీ: జూలై 25
అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://ssc.nic.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.