పీజీ చేసిన వారికి NCERTలో 266 పోస్టులు

-

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ)లో ఖాళీగా ఉన్న 266 ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. NCERT ప్ర‌ధాన కార్యాల‌యం న్యూఢిల్లీలో ఉంది. సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ లేదా పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్య‌త ఉంటుంది. ఆన్‌లైన్‌లో అభ్య‌ర్థులు పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ముఖ్య‌మైన వివ‌రాలు…

* మొత్తం ఖాళీలు: 266
* పోస్టులవారీగా ఖాళీలు: ప్రొఫెసర్‌-39, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-83, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-144
* సబ్జెక్టులు: సైకాలజీ, ఎడ్యుకేషన్‌, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్
* అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్‌లో అర్హత సాధించి ఉండాలి
* ఎంపిక: షార్ట్ లిస్టింగ్‌, ఇంటర్వ్యూల‌ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు
* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
* దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేదీ: ఆగస్టు 3

అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు http://www.ncert.nic.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version