మ‌న జెండా చ‌రిత్ర‌ : జాతీయ పతాకం ప్రస్థానంలో మైలురాళ్లు

-

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు.. ఎన్నో జాతుల‌కు చెందిన ప్ర‌జ‌లు జీవిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక్కో జెండా ఉంటుంది. దాని వెనుక ఘ‌న చ‌రిత్ర ఉంటుంది. అలాగే మ‌న జాతీయ జెండా వెనుక కూడా చెప్పుకోద‌గిన ఘ‌న చ‌రిత్రే ఉంది. independence day సంద‌ర్భంగా మ‌న జెండా చ‌రిత్ర‌ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. ఇక మ‌న దేశాన్ని బ్రిటిష్ వారు పాలించిన‌ప్ప‌టి నుంచి స్వాతంత్య్రం వ‌చ్చే వ‌ర‌కు ర‌క ర‌కాల జెండాల‌ను ఉప‌యోగించారు. జెండా చ‌రిత్ర‌ India Flag history గురించి తెలుసుకుందాం.

జాతీయ పతాకం ప్రస్థానంలో మైలురాళ్లు

బ్రిటిష్ ఇండియా జెండా

British Indian Flag

భార‌త‌దేశాన్ని బ్రిటిష్ వారు పాలించిన‌ప్పుడు ఈ జెండాను ఉప‌యోగించారు. ‘భారతదేశాని’కి మొట్టమొదటిగా ఒక జాతీయ జెండా వచ్చింది. అది ఇతర బ్రిటిష్ వలస దేశాల తరహాలోనే ఉండేది. వాటి మీద బ్రిటిష్ సమ్రాజ్య జెండా ‘యూనియన్ జాక్’ తప్పనిసరిగా ఉండేది.

క‌ల‌క‌త్తా జెండా

first indian national flag – Calcutta flag

1906వ సంవ‌త్స‌రంలో అప్ప‌ట్లో బెంగాల్ విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. అదే ఏడాది ఆగ‌స్టు 7వ తేదీన అప్ప‌టి కల‌క‌త్తా (ఇప్పుడు కోల్‌క‌తా)లో శ‌చీంద్ర ప్ర‌సాద్ బోస్ ఈ ప‌తాకాన్ని రూపొందించారు. ఈ ప‌తాకంలో మూడు రంగులు ఉండేలా తీర్చిదిద్దారు… ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వర్ణాలు ఉంచ‌గా పైన ఎనిమిది కమలం పువ్వులు, మధ్యలో ‘వందే మాతరం’ నినాదంతో పాటు కింద సూర్య, చంద్రుల బొమ్మలు ఉండేవి. దీన్నే క‌ల‌క‌త్తా ప‌తాకం అంటారు.

మేడం భికాజీ కామా జెండా

madam bhikaji cama Flag

1907వ సంవ‌త్స‌రం ఆగ‌స్టు 22వ తేదీన జ‌ర్మ‌నీలో భికాజీ కామా జెండాను స్టుట్‌గార్ట్ ఎగుర‌వేశారు. ఇది కూడా దాదాపు మొదటి పతాకం లాగానే ఈ ప‌తాకంలో కూడా మూడు వ‌ర్ణాల‌ను ఉంచారు. ఈ జెండాలో ఆకుప‌చ్చ రంగును ఇస్లాంకు, కాషాయాన్ని హిందూకు, బౌద్ధ మ‌తాల‌కు సూచిక‌గా వాడారు. ఇంకా పై భాగంలో కమలానికి బదులు.. సప్తరుషులకు గుర్తుగా ఏడు నక్షత్రాలను చేర్చారు. ఈ జెండాను భికాజీ కామా, వీర సావ‌ర్క‌ర్‌, శ్యాంజీ కృష్ణ వ‌ర్మ‌లు క‌లిసి త‌యారు చేయ‌గా మొద‌టి ప్ర‌పంచ యుద్ధం జ‌రిగిన‌ప్పుడు ఈ జెండాను భార‌తీయులు ఎక్కువ‌గా వాడారు.

అనీబీసెంట్, తిలక్ పతాకం

Annie Besant and Lokmanya Tilak Flag

స్వాతంత్య్ర పోరాటం ఉదృతంగా న‌డుస్తున్న స‌మ‌యం 1917లో స్వ‌ప‌రిపాల‌న ఉద్య‌మం (హోం రూల్ ఉద్య‌మం) సంద‌ర్భంగా అనీ బీసెంట్, లోకమాన్య తిలక్‌లు దీనిని ఆవిష్కరించారు. ఈ ప‌తాకంలో ఏడు ఎరుపు గీతలు, ఐదు ఆకుపచ్చ గీతలు ఒకదాని తర్వాత ఒకటి అడ్డంగా పరిచివుంటాయి. వాటిపైన సప్తరుషుల చిహ్నంగా ఏడు నక్షత్రాలు.. పై భాగం మూలన బ్రిటన్ జాతీయ పతాకం, రెండో మూలన సూర్య, చంద్రుల చిహ్నాల‌ను పొందుప‌రిచారు.

పింగిళి వెంకయ్య జెండా

pingali venkayya flag | Know India

జాతీయ జెండాపై అనేక వివాదాలు నెల‌కొన్న నేప‌థ్యంలో మ‌న తెలుగు వాడు పింగ‌ళి వెంక‌య్య అప్ప‌ట్లో ఎరుపు, తెలుపు, ఆకుప‌చ్చ రంగుల్లో ప‌ట్టీలు, మ‌ధ్య‌లో రాట్నంతో జాతీయ జెండాను రూపొందించారు. క‌రాచీలో జ‌రిగిన కాంగ్రెస్ స‌మావేశంలో ఈ జెండాను జాతీయ ప‌తాకంగా ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఈ పతాకాన్ని స్వాతంత్ర్య ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉపయోగించారు.

త్రివర్ణ పతాకం

జాతీయ పతాకం చరిత్రలో 1931 మరో మైలురాయిగా చెప్పుకోవ‌చ్చు. త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా నిర్ణయిస్తూ కాంగ్రెస్ సదస్సులో తీర్మానం చేశారు. మునుపు ఉన్న జెండాలోని ఎరుపు రంగు స్థానంలో కాషాయ రంగు వాడారు. కాషాయం, తెలుపు, ఆకుప‌చ్చ రంగుల‌ను వ‌రుస‌గా ఉంచారు. తెలుపు రంగు మ‌ద్య‌లో చ‌రకాని ఉండేలా నిర్ణ‌యం తీసుకున్నారు.

మ‌న జెండా

జులై 22, 1947న అశోక ఛ‌క్రంతో కూడిన త్రివ‌ర్ణ ప‌తాకాన్ని స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యంగ సభ రూపొందించింది. 1931 నాటి పతాకంలోని రంగులను అలాగే ఉంచి.. తెలుపు రంగు మీద చరఖా స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ చక్రం ముదురు నీలం రంగులో ఉంటుంది.  జెండాలో ఉన్న ఒక్కో రంగు ఒక్కో విష‌యాన్ని మ‌న‌కు తెలియజేస్తాయి. కాషాయ రంగు దేశ ప‌టిష్ట‌త‌కు, ధైర్యానికి ప్ర‌తీక‌గా నిలిస్తే, మ‌ధ్య‌లో ఉండే తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కింద ఉండే ఆకుప‌చ్చ రంగు దేశ ప్ర‌గ‌తికి సూచిక‌గా నిలుస్తుంది. ఇక మ‌ధ్య‌లో ఉండే అశోక చ‌క్రం ధ‌ర్మాన్ని సూచిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version