నాగార్జున-రమ్యకృష్ణ, వెంకటేశ్-మీనా.. జంటగా నటిస్తే సినిమాలు సూపర్ హిట్..!

-

తెలుగు చిత్ర సీమలో ఒకసారి హిట్ కాంబినేషన్ కుదిరితే చాలు..నెక్స్ట్ వీరి కాంబోలో పిక్చర్ వస్తుందా? అని సినీ లవర్స్, ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. అలా ఆన్ స్క్రీన్ పెయిర్ గా నటించిన వీరి సినిమాలు వరుసగా సూపర్ హిట్ కావడం విశేషం. ఆ హిట్ పెయిర్స్ గురించి తెలుసుకుందాం.

టాలీవుడ్ నవ్వుల రాజు..రాజేంద్రప్రసాద్-ఆమనీ జంటగా నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటాయి.

అలా వీరి కాంబోలో వచ్చిన నాలుగు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో వీరి కాంబోలో మళ్లీ పిక్చర్ వస్తుందని టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

వెంకటేశ్-మీనా..ఈ కాంబినేషన్ కు అయితే ప్రేక్షకుల్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు.‘చంటి’, ‘సుందర కాండ’, ‘అబ్బాయి గారు’, ‘సూర్య వంశం’.. ఫిల్మ్స్ వీరి కాంబినేషన్ లో రాగా, అవన్నీ బ్లాక్ బాస్టర్స్ గా నిలిచాయి. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరు ‘దృశ్యం’, ‘దృశ్యం-2’లో నటించారు. ఈ పిక్చర్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

నాగార్జున-రమ్యకృష్ణ జోడీకి కూడా తెలుగు నాట మంచి ఆదరణ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఆన్ స్క్రీన్ జంటకు మంచి మార్కులే వేశారు. వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు అన్నీ కూడా దాదాపుగా ఘన విజయం సాధించాయి.

‘హలో బ్రదర్’, ‘ఘరానా మొగుడు’, ‘అన్నమయ్య’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఈ ఏడాది వచ్చిన ‘బంగార్రాజు’ పిక్చర్ కూడా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇందులో నాగార్జున-రమ్యకృష్ణ జంటగా నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version