పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష – 2025 ఈనెల 13 నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎగ్జామ్ సెంటర్ల వద్ద బీఎన్ఎస్ సెక్షన్ -163 ప్రకారం ఆంక్షలు అమల్లో ఉంటాయని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ సీపీ పోతరాజు సాయి చైతన్య తెలిపారు.ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష – 2025 కోసం జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిషేధాజ్ఞలు జారీ చేశామన్నారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బీఎన్ఎస్ అండర్ సెక్షన్ 163 అమలులో ఉంటుందన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడ రాదని, నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరుగవద్దని సీపీ సూచించారు.అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలోని జిరాక్స్ సెంటర్‌లను అన్నింటిని ఈనెల 13 న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మూసి ఉంచాలని సీపీ ఆదేశించారు.