పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఖాతా వున్నవాళ్లు ఇవి తెలుసుకోవాలి…!

-

ఇండియన్​ పోస్ట్​ పేమెంట్ బ్యాంక్ లో మీకు అకౌంట్ వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్​ పోస్ట్​ పేమెంట్ బ్యాంక్ సేవింగ్స్​ అకౌంట్ ఉన్నవాళ్ళకి శుభవార్తని అందించింది. పోస్టల్​ డిపాజిట్లను సులభతరం చేసేందుకు పోస్టల్​ విభాగం తాజాగా కొత్త ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టంని తీసుకొచ్చింది.

 

India Post‌ Payments‌

ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ కొత్త ఫెసిలిటీని మొబైల్ ఫోన్​ ద్వారానే పొందవచ్చు. ఐవీఆర్​ సేవతో మీ పోస్టల్​ పెట్టుబడులకు సంపాదించిన వడ్డీ, బ్యాలెన్స్​, డిపాజిట్​ వివరాలు, ఏటీఎమ్​ కార్డ్ బ్లాకింగ్ మొదలైన వాటిని పొందొచ్చు. పీపీఎఫ్​, ఎన్​ఎస్​సీ వంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన కస్టమర్లు 18002666868 ట్రోల్​ ఫ్రీ నంబర్​కు కాల్​ చేసి వివరాలను తెలుసుకోవడానికి అవుతుంది అని బ్యాంక్ అంది.

ఇలా నెంబర్ కి డైల్ చేసి 1 నంబర్​ నొక్కితే హిందీలో సమాచారం వస్తుంది. అదే 2 నంబర్​ నొక్కితే ఇంగ్లీష్​లో సమాచారం వస్తుంది. ఇది ఇలా ఉంటే పోస్టల్​ డెలివరీ సేవలు, రిజిస్టర్​ పోస్ట్​ సేవలు, జీవిత బీమా ప్రీమియం గడువు తేదీ, ప్రీమియం మొత్తం, పాలసీ స్టేటస్​, పాలసీ మెచ్యూరిటీ తేది, హామీ మొత్తం, బ్యాంకింగ్​, ఇన్సూరెన్స్​ సేవలు ఇలాంటివి అన్నీ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి డయల్ చేసి సమాచారం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news