ముంబై దాడులకు 13 ఏళ్లు .. ఇప్పటికీ భారతీయును వెన్నాడుతున్న ఉగ్రదాడి

ముంబై ఘోరకలికి 13 ఏళ్లు నిండాయి. 2008 నవంబర్ 26న దేశ వాణిజ్య రాజధానిపై పాక్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 160 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 10 మంది ఉగ్రవాదులు పాకిస్థాన్ ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CST – రైల్వే స్టేషన్), తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, హోటల్ ఒబెరాయ్ ట్రైడెంట్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మజగావ్‌లో, విలే పార్లేలో క్యాబ్‌లో పేలుళ్లు సంభవించాయి. ఇష్టారీతిలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అసలు ఏం జరుగుతుందో .. అధికారులకు తెలియని పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా తాజ్ మహల్ హోటల్లో భారీగా కాల్పలు చోటు చేసుకోవడం, తగలబడుతున్న హోటల్ ప్రతీ భారతీయుడి మదిలో స్థిరపడింది. మూడు రోజులు సాగిన మారణ హోమం ప్రపంచాన్ని కలవరపరిచింది. లష్కర్ ఏ తోెయిబా ఉగ్రవాదులు పాకిస్థాన్ కరాచీ నుంచి పడవ ద్వారా ముంబైలోని కొలాబా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ దాడిలో ఉగ్రవాది కసబ్ మాత్రమే సజీవంగా పట్టుబడ్డాడు. మొదట పాకిస్థాన్ తమ దేశం వాడు కాదని బుకాయించినా… తరువాత అంగీకరించింది. కసబ్ ను కోర్ట్ దోషిగా గుర్తించడంతో పూణేలోని ఎరవాడ జైలులో 21 నవంబర్ 2012న మరణించే వరకు ఉరి తీశారు. ఈ దాడుకలు ముఖ్య సూత్రధారిని జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీని భారత అధికారులు దాడికి ప్రధాన సూత్రధారులలో ఒకరిగా పేర్కొనడంతో పాక్ అధికారులు 2008లో అరెస్టు చేశారు. ఆ తరువాత బెయిల్పై విడుదలయ్యాడు.