రంజాన్ తర్వాత ముస్లింలు జరుపుకునే అతి పెద్ద పండుగ బక్రీద్. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే మూగజీవి.. ఈద్ అంటే పండుగ అని అర్థం.ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకొంటారు.ఇస్లామీయ కేలండర్ ప్రకారం 12వ నెల యైన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్-అల్-హరామ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు.
ఇదిలా ఉంటే… బక్రీద్ పండుగ సందర్భంగా ఈనెల 17న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నెలవంక దర్శనం ఆధారంగా ముస్లింలు బక్రీద్ను జరుపుకుంటారు. ఈనెల 7న నెలవంక కనిపిస్తే జూన్ 17న, లేకపోతే 18న జరుపుకోనున్నారు. పండుగ జరుపుకునే రోజున (17or18) సెలవు ఉండనుంది.