RRR Movie Updates : దిమ్మ తిరిగేలా ప్రీ రిలీజ్ ఈవెంట్? ఎక్క‌డంటే!

RRR Movie Updates: టాలీవుడ్ ఇండస్ట్రీ హ‌ట్ టాఫిక్.. ఆర్‌.ఆర్‌.ఆర్ మూవీ. ప్ర‌పంచ దృష్టిని ఆకర్షించే విధంగా ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్ ఎస్ రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మ‌ల్టీ స్టార‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ అనౌన్స్ మెంట్ డే నుంచే .. భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

అందుకు ప్ర‌త్యేకంగా కార‌ణం చెప్ప‌ల్సిన అవ‌స‌రం లేదు. బాహుబ‌లి వంటి సెన్సేష‌న‌ల్ హిట్ అందించిన ద‌ర్శ‌క దిగ్గ‌జం మూవీ కావ‌డం. టాలీవుడ్ అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు న‌టిస్తుండ‌టం ప్ర‌ధాన కారణాలు. దీంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. వీటితో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ న‌టించ‌డం కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, దోస్తీ పాటకు భారీ స్పందన వచ్చింది.

ఈ క్ర‌మంలో ఈ మూవీపై ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించేలా భారీ ఎత్తున ప్లానింగ్ చేస్తున్నారు జ‌క్క‌న్న‌. రిలీజ్ కు రెండు నెల‌ల ముందే మూవీ ఫీవ‌ర్‌ను పెంచ‌డానికి జ‌గ్గ‌న్న ప్ర‌య‌త్నాలు షురూ చేశార‌ట‌.
ఇందులో భాగంగా ఈసారి భార‌తీయ ప్రేక్ష‌కుల‌నే కాకుండా ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్‌పై కూడా జ‌గ్గ‌న్న స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించేలా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను
దుబాయ్‌లో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ర‌ట‌. ఈవెంట్‌ను నిర్వ‌హించ‌డానికి ఏ ప్లేస్ అయితే బావుంటుందని ఆలోచిస్తున్నార‌ట‌.

ఇదిలా ఉంటే.. మ‌రో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆర్ ఆర్ ఆర్ మూవీని ఇంగ్లీష్ లో డబ్ చేయ‌డానికి ప్రముఖ హాలీవుడ్ సంస్ద వార్నర్ బ్రదర్శ్ సంస్ద తెగ ఆస‌క్తి చూపిస్తుందట‌. అందుకోసం జ‌క్క‌న్న అండ్ టీమ్‌తో చ‌ర‌ర్చ‌లు జ‌రుపుతుంద‌ట‌. ఈ విషయమై నిర్మాత దానయ్య, రాజమౌళిల‌తో చర్చలు జరుపుతున్నారట.

ఈ మేరకు ఆ సంస్ద వారు రిలీజ్ స్ట్రాటజీ, ప్రమోషన్ యాక్టివిటీస్ తో కూడిన తమ ప్లాన్ ని రాజమౌళికి పంపారట. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని అంటున్నారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో యావ‌త్ ప్ర‌పంచం ఆర్ ఆర్ ఆర్ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తుంది.

అలాగే ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ అప్ డేట్ ఇచ్చేసారు. అది అక్టోబర్ 29 న ఆర్.ఆర్.ఆర్ నుండి బిగ్ అప్ డేట్ రాబోతుంది అంటూ ట్వీట్ చేసారు. ఎలాంటి అప్ డేట్ ఇస్తారో అనే క్యూరియాసిటిలో ఫాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడు ఉత్సుకతతో ఉన్నారు.