రేపు బీజేపీ ఆధ్వ‌ర్యంలో మృత్యుంజ‌య హోమాలు

-

రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వ‌ర్యంలో మృత్యుంజ‌య హోమాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పంజాబ్ లో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో భ‌ద్ర‌త వైఫ‌ల్యం అయిన విష‌యం తెలిసిందే. దీంతో పంజాబ్ లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కాన్వాయ్ అడ్డుకున్నారు. చాలా సమ‌యం ప్ర‌ధాన మంత్రి మోడీ కాన్వాయ్ ఆగిపోయింది. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌ధాని మోడీ ఎలాంటి అపాయం జ‌ర‌గ‌కుండా ఉండాల‌ని రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మృత్యుంజ‌య హోమాలు నిర్వ‌హించాల‌ని రాష్ట్ర బీజేపీ నిర్ణ‌యం తీసుకుంది. రేపు అన్ని జిల్లాల్లో, మండ‌లాల్లో, గ్రామాల్లో మృత్యుంజ‌య హోమం నిర్వ‌హించాల‌ని బీజేపీ కార్య‌కర్త‌ల‌కు, ప్ర‌జ‌లకు ప్ర‌ధాని మోడీ అభిమానులకు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పిలుపు నిచ్చారు. అలాగే రేపు హైద‌రాబాద్ లోని అల్కాపురిలోని శృంగేరి మ‌ఠం ఆలయంలో జ‌ర‌గ‌బోయే మృత్యుంజ‌య హోమంలో బండి సంజ‌య్ పాల్గొన‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version