అఫీషియల్: హొంబలే ఫిల్మ్స్ బిగ్ అనౌన్స్‌మెంట్..ఆ డైరెక్టర్‌తో సినిమా

-

KGF చాప్టర్ 1, చాప్టర్ 2 వంటి భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినీ నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ మరో బిగ్ న్యూస్ చెప్పింది. నెక్స్ట్ ఫిల్మ్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుధా కొంగరతో తీయబోతున్నట్లు గురువారం ప్రకటించింది ఈ మేరకు పోస్టర్ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ లో రిలీజ్ చేశారు మేకర్స్.

ఇండియా గర్వపడేలాగా ఈ సినిమా ఉండబోతున్నదని, ఈ కథను ఇంతకు ముందు ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు హొంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూసర్. ఇటువంటి కథ ఇంతవరకు చెప్పలేదని, అందుకే తాము సుధా కొంగరతో ఈ సినిమా చేయబోతున్నామని ప్రకటించారు. తమ గత చిత్రాల మాదిరిగానే ఈ పిక్చర్ కూడా భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో ఉండబోతున్నదని వివరించారు.

హొంబలే ఫిల్మ్స్ వారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ సినిమా చేస్తున్నారు. హొంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ ఓనర్ విజయ్ కిరంగదూర్. కేజీఎఫ్ చిత్రంతో ఈ ప్రొడక్షన్ హౌజ్ కు చక్కటి పేరు వచ్చింది. సుధా కొంగర గత చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయ్యాయి.

సుధా కొంగర గత చిత్రం ‘సురారై పోట్రు’ ..తెలుగులో ‘ఆకాశమే నీ హద్దు రా’ పేరుతో విడుదలైంది. ఈ చిత్రం చక్కటి విజయం సాధించింది. సుధా కొంగర దర్శకత్వంలో ..హొంబలే ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కబోయే చిత్రంలో హీరో, హీరోయిన్స్, మ్యూజిక్..తదితర డీటెయిల్స్ త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version