గత ఐదేళ్లలో పోలీస్ శాఖలో జగన్ ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని హోంమంత్రి అనిత అన్నారు. గుంటూరు రేంజ్ పరిధిలో పోలీసు న్నతాధికారులతో హోంమంత్రి అనిత గుంటూరులోని పోలీస్ కార్యాలయం వేదికగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా వంటి వైసీపీ నాయకులు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. విమర్శల తీరు వారి సంస్కారానికి నిదర్శనమన్నారు. వైసీపీ నాయకులు పోలీసులను కూడా బెదిరించి అప్పర్ హ్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను ఉద్దేశించి హోంమంత్రి మండిపడ్డారు.
గోరంట్ల మాధవ్ విషయంలో పోలీసుల పొరపాటు ఉందని తేలినందునే సస్పెన్షన్ చేసినట్లు స్పష్టం చేశారు. వైసీపీ చర్యలకు కాలం సమాధానం చెబుతుందన్నారు. చట్టప్రకారం శిక్షించడంపై మరింత దృష్టి సారిస్తామని అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30 ఫోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేశామని చెప్పారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు తమ కర్తవ్యం నిర్వహిస్తున్నారన్నారు. హైకోర్టు, రాజధాని, సచివాలయం, రాజకీయ పార్టీ కార్యాలయాలు, నాయకుల నివాసాల నేపథ్యంలో గుంటూరులో మరింత భద్రత పెంచడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.