ఇంటి అద్దె కట్టలేదని చెప్పులతో దాడి…!

-

హైదరాబాద్ లో కొందరు ఇంటి యజమానులు ఇప్పుడు ఇంటి అద్దె కోసం వేధింపులు మొదలుపెట్టారు. ఒక పక్క ప్రభుత్వం చెప్పినా సరే కొందరు మాత్రం ఇంటి అద్దె కావాలి అని వేధింపులకు దిగడం ఆందోళన కలిగిస్తుంది. లాక్‌డౌన్ ముగిసే వరకు ఇంటి అద్దె వసూలు చేయవద్దని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. మూడు నెలల తర్వాత ఇంటి అద్దె వసూలు చేసుకోవాలి, సులభ వాయిదాలలో వసూలు చేసుకోవాలని పేర్కొంది.

వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని స్పష్టంగా చెప్పింది. అయినా సరే కొందరు మాత్రం నానా రకాలుగా వేధిస్తున్నారు. లాక్ డౌన్ లో ఎవరూ కూడా బయటకు రావొద్దని చెప్తున్నా సరే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలి అని హెచ్చరిస్తున్నారు. కొంత మంది ఖాళీ చేయించి పంపారు. హైదర్‌గూడలో ఇంటి అద్దె కట్టనందుకు సామాన్లు బయటపడేసి అమానుషంగా వ్యవహరించారు.

లాక్‌డౌన్ ఉన్నా సరే ప్రతీ నెలా రెంట్ చెల్లించాలని ఇంటి యజమాని వేధించడమే కాకుండా చెప్పులతో దాడికి దిగారు. వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యాలని స్పష్టం చేసారు. వాళ్లకు ఉపాధి లేకపోవడంతో అద్దె కట్టలేక మరో ఇంటికి వెళ్ళలేక ఇబ్బందులు పడ్డారు. దీనితో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమను ఆదుకోవాలని కోరారు. ఇంటి యజమానులపై కేసు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version