వానాకాలం వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ, ఈ కాలం ఎన్నో వ్యాధులను దారితీస్తుంది. ముఖ్యంగా ఇంట్లోకి ఈగలు, చెదలు, చీమలు, బొద్దింకలు ఎక్కువగా వస్తాయి. ఇవి వివిధ వ్యాధులకు కారణమవుతాయి. అందుకే వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే, ఇంట్లోకి ఏ క్రిములు రాకుండా ఉండటానికి ఎలాంటి హానికాకర రసాయనాలు లేకుండా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతో వాటిని తరిమేయవచ్చు.
ఈగలు, దోమల అనారోగ్యాలను తెస్తాయి. వేపాకు, సాంబ్రాణి, కర్పూరం మండిస్తే పొగ వస్తుంది. ఆ పొగకు ఈగలు, దోమలు పారిపోతాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే చెక్క సామాగ్రిని వర్షా కాలంలో చెదలు పాడు చేస్తాయి. ఇవి పుస్తకాలు, బట్టలను నాశనం చేస్తాయి. చెదలు ఉన్న ప్రాంతంలో గుప్పెడు వేపాకులు ఉంచాలి. ఇక ఇంట్లో తిరిగే బల్లులు మీద పడతాయోమొనని భయంగా ఉంటంది. అందుకే అవి తిరిగే చోట్ల గుడ్డు పెంకులను ఉంచాలి. ఉల్లిగడ్డ, వెల్లుల్లి వాసనకూ బల్లలు పారిపోతాయి.
వర్షాకాలం.. ఇంట్లో వాష్ బేసిన్లు, సింకులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో నీరు బయటకు వెళ్లే చోట ఫినైల్ టాబ్లెట్లను ఉంచాలి. ఇలా చేస్తే బొద్దింకల బెడద తగ్గుతుంది. తినే పదార్థాలను కూడా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. లేదంటే చీమలు ఎక్కువగా వస్తాయి. ఆ ప్రాంతాంలో కాస్త పసుపు, బోరాక్స్ పొడి కలిపి చల్లాలి.