ప్రస్తుతం యావత్ ప్రపంచాన్నే కరోనా వైరస్ భయపెడుతోంది. జలుబు చేస్తే చాలు కరోనా వైరస్ అని భయపడే పరిస్థితి వచ్చింది. శ్వాస ఇబ్బందులు తీవ్రం అయ్యేలా చేసే ఈ వైరస్‌ను మొదట వుహాన్ నగరంలో గుర్తించారు. వేగంగా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్‌కు న్యుమోనియా లాంటి లక్షణాలు ఉంటాయి. చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్‌కు చేరింది. ఈ వైరస్‌కు సంబంధించిన తొలి కేసు కేరళలో నమోదయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే కరోనావైరస్ వల్ల చైనాలో వందల మంది అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రాణాంతక కరోనాకు హోమియోపతి, యునాని మందులు బాగా పనిచేస్తాయని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు సమావేశం తర్వాత ఆయుష్ ఈ ప్రకటన చేసింది. ఆర్సినికం ఆల్బమ్ 30 అనే మందు కరోనాపై బాగా పనిచేస్తుందని, పరగడుపుతో మూడు రోజుల పాటు తీసుకుంటే కరోనా వైరస్ సోకకుండా నియంత్రించవచ్చని తెలిపింది. మరో నెల తర్వాత సేమ్ డోస్‌ను తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయని చెప్పింది. కొన్ని ఆయుర్వేదిక్ మందులు, యునాని డికాక్షన్లు, ఇంటి ఔషధాలూ మెరుగ్గా పనిచేస్తాయని చెప్పింది.