Honey Rose : పట్టుచీరలో పుత్తడి బొమ్మలా బాలయ్య బ్యూటీ

-

వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్​లోకి రీ ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్. ఒక్క సినిమాతోనే ఈ భామ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు కుర్రాళ్లు హనీ రోజ్ అంటే మనసు పారేసుకుంటున్నారు. ఇక నిర్మాతలు కూడా ఈ బ్యూటీకి అవకాశాలిచ్చేందుకు క్యూ కడుతున్నారు.

హనీ రోజ్ సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. తరచూ కొత్త ఫొటోషూట్లు చేస్తూ ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ పట్టుచీరలో దర్శనమిచ్చింది. వయెలెట్ కలర్ పట్టుచీరలో హనీ రోజ్ పుత్తడి బొమ్మలా కనిపించింది.

అయితే ఈ ట్రెడిషనల్ లుక్ అంతా ఓ షాపింగ్ మాల్ ఓపెన్ కోసమేనట. విశాఖలో సందడి చేసిన హనీరోజ్ ఓ షాపింగ్​ మాల్​ ఓపెనింగ్​కు గెస్టుగా వచ్చింది. ఆ షోరూంలో విభిన్న జ్యువెలరీ ధరిస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. చీరకట్టులో హనీ రోజ్ అందానికి కుర్రాళ్లు మతిపోగొట్టుకుంటున్నారు. మరి ఆ అందాల భామ విశాఖలో సందడి చేసిన ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version