ఉగ్రవాదులతో పోరాడి హార్స్ రైడర్ మృతి.. విషాదంలో కుటుంబం

-

జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో హార్స్ రైడర్స్ సయ్యద్ హుస్సేన్ షా టూరిస్టులను రక్షించే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయాడు. పర్యాటకులపై దాడికి దిగిన ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నంతో ప్రమాదవశాత్తు తన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఉగ్రవాదుల నుండి తుపాకీని లాక్కునే ప్రయత్నంలో హుస్సేన్ షాను ఉగ్రవాదులు కాల్చి చంపేసినట్లు తెలిసింది.

ఈ ఘటనపై హుస్సేన్ షా కుటుంబం కన్నీటిపర్యంతం అయ్యింది. గుర్రం తోలుతూ ఇంటిని పోషించే తన కొడుకును ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని అతని తల్లి రోదించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్‌కు చెందిన సయ్యద్ హుస్సేన్ పహల్గాం ప్రాంతంలో గుర్రం తోలుతూ కుటుంబాన్ని పోషించేవాడని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news