ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగిందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పహల్గంలో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో సుమారు 30 మంది సామాన్యులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్..జమ్ము కాశ్మీర్ ఘటనలో ఇంటెలిజెన్సీ వైఫల్యం కనిపిస్తుందన్నారు. పర్యటన కోసం వచ్చిన విదేశీయులు సైతం ఈ దాడిలో మరణించడం బాధాకరం అని అన్నారు. ఇది పుల్వామా కంటే అతిపెద్ద ఘటన అని.. ఈ ఘటనపై ప్రభుత్వం కేంద్రం సీరియస్‌గా దృష్టి పెట్టాలని కోరారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఇప్పుడే పునరావృతం కాకుండా చూడాలని స్పష్టంచేశారు.