వైసీపీలో జ‌గ‌న్ గురించి ఇదే బిగ్ హాట్ టాపిక్‌…!

-

రాజ‌కీయంగా, సామాజికంగా కూడా ఏ పార్టీలో అయినా ప్రాధాన్యం ఉండాల‌ని కోరుకోవ‌డం నాయ‌కుల ప్ర‌ధా న ల‌క్ష్యం. ఈ విష‌యంలో ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్ర‌తిపార్టీలోనూ నాయ‌కులు ఇదే విధంగా ఆలోచిస్తారు. ప్ర‌స్తుతం వైసీపీలోనూ ఇదే త‌ర‌హా చ‌ర్చ సాగుతోంది. అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు ఏదో ఒక రూపంలో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, ఒక్క క‌ర్నూలుకు త‌ప్ప అంటున్నారు వైసీపీ నాయ‌కులు. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు ప్ర‌తి జిల్లాకు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తున్నార‌నేది వాస్త‌వం.

కానీ, క‌ర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నాయ‌కులు మాత్రం మా జిల్లాకు జ‌గ‌న్ ఏం చేశార‌ని ప్ర‌శ్నిస్తున్నా రు. వీరి ఆలోచ‌న ప్ర‌కారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడికి స్పీక‌ర్ ప‌ద‌వి, విజ‌య‌న‌గ‌రం జి ల్లాకు చెందిన నాయ‌కుడికి మంత్రి ప‌ద‌వి.,. ఇలా ప్ర‌తి జిల్లాకు ఏదో ఒక రూపంలో ప్రాధాన్యం ద‌క్కింద‌ని చెబుతున్నారు. అంతేకాదు, కొన్ని జిల్లాల్లో ఒక‌రికి ఇద్ద‌రు మంత్రులుగా ఉన్నార‌ని అంటున్నారు. అయితే, క‌ర్నూలు జిల్లాకు చెందిన నాయ‌కులకు జ‌గ‌న్ స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని చెబుతున్నారు.

అయితే, ఇదంతా కూడా ఓ నాయ‌కుడు ప‌నిక‌ట్టుకుని చేస్తున్న ప్ర‌చారం అన్న టాక్‌ కూడా ఉంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన ఓ నాయ‌కుడు వైసీపీ టికెట్‌పై గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించా రు. అయితే, ఆయ‌న మంత్రి ప‌ద‌విని ఆశించారు. కానీ, జ‌గ‌న్ ఆయ‌న‌కు ఇవ్వ‌లేదు. దీంతో తాను త్యాగం చేసి మ‌రీ వైసీపీలోకి వ‌చ్చి గెలిచాన‌ని, అయినాకూడా జ‌గ‌న్ త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆయ‌న జిల్లాను కేం ద్రంగా చేసుకుని వైసీపీపై దాడి చేసేలా కొంద‌రిని ప్రోత్స‌హిస్తున్నార‌ని అంటున్నారు. నిజానికి క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు జ‌గ‌న్ రెడీగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, దీనిని కూడా వ్య‌తిరేకిస్తున్న వారి జాబితాలో తాజాగా ఈయ‌న కూడా చేర‌డం వెనుక ప‌దువి కోసమే ఇలా చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి వైసీపీలో జ‌రుగుతున్న ఈ చ‌ర్చ ఎలాంటి ప‌రిణామానికి దారి తీస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version