వాస్తు: కిటికీల విషయంలో ఈ తప్పులు చెయ్యద్దు..!

-

చాలా మంది ఇళ్లల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యల నుండి బయట పడాలంటే వాస్తు చిట్కాలని అనుసరిస్తూ ఉండాలి. వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన చిట్కాలని చెప్పారు మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం మనం ఇప్పుడే తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే కిటికీల పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఇల్లు, ఆఫీస్ మరియు ఇతర ప్రదేశాలలో కూడా ఈ నియమాలని పాటిస్తూ ఉండాలి. ఇంట్లో ఉండే కిటికీల ద్వారా తాజా గాలి వస్తుంది. అదే విధంగా వెలుతురు కూడా వస్తుంది. పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తుంది. దీంతో ఇంట్లో ఉండే వాతావరణాన్ని అది ఎఫెక్ట్ చేస్తుంది.

అందుకని తప్పకుండా కిటికీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. అలానే నెగటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. అయితే కిటికీల విషయంలో ఎలాంటి నియమాలను పాటించాలి అనేది చూస్తే..

ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ ఫ్లాట్ లో కానీ మీరు కిటికీలను పెట్టేటప్పుడు తూర్పు, ఉత్తరం మరియు పడమర దిక్కుల్లో ఉండేటట్లు చూసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అయితే ఎప్పుడూ కూడా దక్షిణవైపు కిటికీలు ఉండకూడదు గమనించండి. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version