ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 11 న పథకం ప్రారంభం కాబోతోందని ఆయన తెలిపారు.
తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తామని హామీ ఇచ్చారు. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు.కనీసం 400 చదరపు అడుగుల ఇల్లు నిర్మించాలని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులు, రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అన్నారు.కాగా, ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం హడ్కో8 నుంచి రూ.3,000ల కోట్ల రుణం నిధులతో తెలంగాణ వ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.