మమ్ముల్ని విమర్శించే అర్హత బీజేపీ కి లేదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

NDSA బృందం నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఏ నాలుగు నెలలు రిపోర్టు సమర్పిస్తామని తెలిపిందని, అంతకన్నా ముందే ప్రాథమిక రిపోర్ట్ వీలైనంత తొందరలో ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగా వెంటనే డాం రిపేర్ తో పాటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ టిఆర్ఎస్ కు ఏటీఎంగా మారటానికి ప్రధాన కారణమే మోడీ ప్రభుత్వమని, కార్పొరేషన్ల ద్వారా 84 వేల కోట్ల రుణం అందించింది కేంద్రమే కదా అని ఆయన అన్నారు. మమ్మల్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మేము కోరిన వెంటనే జలాశక్తి శాఖ కమిటీ వేసి పరిశీలనకు పంపినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన అంశంలో పునరుద్ధరణకు చేయాల్సిన అంశంలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నామన్నారు. మీ సలహాలను పాటించి మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామన్నారు. బ్యారేజి డ్యామేజ్ కి రీజన్స్ చెప్పాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version