అల్లు అర్జున్ నుంచి రవితేజ వద్దకు బ్లాక్ బాస్టర్ ‘భద్ర’..అలా ఎలా జరిగిందంటే?

-

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తొలి చిత్రం ‘భద్ర’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ మూవీతో బోయపాటి శ్రీను స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. యాక్షన్ సీన్స్ తీయడంలో బోయపాటి కి అంటూ ఒక బ్రాండ్ ఆ తర్వాత కాలంలో ఏర్పడింది. అయితే, ఈ పిక్చర్ స్టోరిని బోయపాటి శ్రీను తొలుత అల్లు అర్జున్ కు వినిపించాడు. ఆయన కోసమే అని ఈ స్క్రిప్ట్ ను లాక్ చేసుకుని ఉండిపోయాడు.

అలా అల్లు అర్జున్ కోసం బోయపాటి శ్రీను వెయిట్ చేస్తున్న క్రమంలో..బన్నీకి ఈ సినిమా చేయాలా? వద్దా? అనే అనుమానం ఉందట. స్టోరి బాగానే ఉన్నప్పటికీ తనకు అప్పుడే ఇంతటి యాక్షన్ ఇమేజ్ లేదనే అభిప్రాయం వచ్చిందట. అలా ఈ స్టోరిని అల్లు అరవింద్ తో పాటు ప్రొడ్యూసర్ దిల్ రాజుకు వినిపించారు. అలా ఈ స్టోరి బన్నీకి సూట్ కాదనే అభిప్రాయం వచ్చిందట.

ఇక అప్పటికే బన్నీ ‘ఆర్య’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న తాను ఇప్పుడే ‘భద్ర’ వంటి యాక్షన్ మూవీ చేయకూడదని నిర్ణయించుకున్నారట. అలా ఆ సినిమ స్టోరి దిల్ రాజు ద్వారా రవితేజ వద్దకు వెళ్లింది. రవితేజకు పిక్చర్ స్టోరి నచ్చిన క్రమంలో ..సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అలా ఈ పిక్చర్ రవితేజ-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చి సూపర్ హిట్ అయింది.

bhadra film raviteja boyapati

ఇందులో రవితేజ మార్క్ కామెడీ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మీరాజాస్మిన్ ఇందులో హీరోయిన్ గా నటించగా, కీలక పాత్ర ప్రకాశ్ రాజ్ పోషించారు. బోయపాటి శ్రీను అలా అల్లు అర్జున్ కోసం అనుకున్న స్క్రిప్ట్ ను మాస్ మహారాజ రవితేజతో చేశారు. ఇక చాలా ఏళ్ల తర్వాత బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ అనే బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version