సేంద్రీయ వ్యవసాయం ఎలా చేస్తారు? పాటించాల్సిన పద్ధతులు..

-

ప్రస్తుతం రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువులను వాడుతున్నారు..వాటి వల్ల ఇప్పుడు కొంత వరకూ ప్రయోజనం ఉన్నా కూడా తర్వాత చాలా నష్టాలను చూడాలి..అందుకే వ్యవసాయ నిపుణులు సెంద్రీయ వ్యవసాయం చేపట్టాలని సూచిస్తున్నారు.ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే ఆర్గానిక్ పదార్ధాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత రసాయన, క్రిమిసంహారక మందులు ఉపయోగించి వ్యవసాయం చేసే పద్దతి వచ్చింది. సేంద్రియ వ్యవసాయం అనేది సాంప్రదాయ వ్యవసాయం. స్వచ్చమైన వ్యవసాయం అని చెప్పవచ్చు..

ఈ వ్యవసాయం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా?

వ్యవసాయ నేల శక్తి పెరుగుతుంది..అలాగే నేలలో హ్యూమస్‌ నిల్వలు పెరిగి పోషకాలను పంటకు అందిస్తుంది.నీటిని, పోషకాలను నిలువరించే గుణం పెరుగుతుంది.నీటి నిల్వ సామర్ద్యం, మురుగు నీరు పోవు సౌకర్యం కలుగుతుంది.నేల కాలుష్యం తగ్గి నాణ్యతతో కూడిన ఉత్పాదకత జరుగుతుంది.భూగర్బజలాల కాలుష్య నివారణకు దోహదపడుతుంది.పర్యావరణ సమతుల్యత దోహదపడుతుంది.నాణ్యమైన సురక్షిత ఆహారం లభిస్తుంది..నాణ్యత, నిల్వ ఉండే గుణం పెరుగుతుంది.

సెంద్రీయ వ్యవసాయ పద్దతులు..

ఎక్కువగా నేలను దున్నకూడదు..ఎక్కువగా దుక్కి దున్నితే నేల కోతకు గురి కావడమే కాక నెలలోని సూక్ష్మజీవులు , ప్లనకాల సంఖ్యా బాగా తగ్గిపోతుంది. అందుకే తక్కువగా దుక్కి దున్నాలి. సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంటలను సాగు చేయాలి. మిశ్రమ పంటలను సాగు చేయడం వల్లన పురుగుల తాకిడి తగ్గించవచ్చు..అదే విధంగా పంట మార్పిడి చేస్తూ ఉండాలి.ఇలా చేయడం వల్ల నేల సారం పెరుగుతుంది. కీటకాలు, పురుగుల నుంచి రక్షణ ఉంటుంది.వృక్ష, జంతు సంబంధ వ్యర్ధాలను అన్నిటినీ సేంద్రియ ఎరువుగా మార్చి వినియోగించాలి..ఇలా చేయడం వల్ల నేల సారం పెరుగుతుంది. కీటకాలు, పురుగుల నుంచి రక్షణ ఉంటుంది.వృక్ష, జంతు సంబంధ వ్యర్ధాలను అన్నిటినీ సేంద్రియ ఎరువుగా మార్చి వినియోగించాలి..ఈ ఎరువులను వాడటం వల్ల అధిక దిగుబడిని పొందవచ్చు.. ఇలా పండించినవి ఆరోగ్యానికి మంచివి కూడా..

Read more RELATED
Recommended to you

Exit mobile version