పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నారు : మంత్రి కేటీఆర్‌

-

సైబ‌ర్ నేరాల‌కు అడ్డుక‌ట్ట ప‌డే విధంగా పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నార‌ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్‌లో పోలీసు సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ ఫ‌ర్ సైబ‌ర్ సేఫ్టీ వ్య‌వ‌స్థ‌ను హోం మంత్రి మ‌హ‌ముద్ అలీతో క‌లిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, సైబ‌రాబాద్ సీపీ స్టీఫేన్ ర‌వీంద్ర‌తో పాటు ప‌లువురు పోలీసు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. దేశంలోని సైబ‌ర్ నేరాల‌ను అరిక‌ట్ట‌డంలో తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను మంత్రి కేటీఆర్ కొనియాడారు. పారిశ్రామిక సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అత్యాచార నిందితుల జాబితా తయారు చేసి.. భవిష్యత్తులో వాళ్లకు ఎక్కడా ఉద్యోగాలు రాకుండా చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకోసం.. ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ రూపొందించి అందులో నిందితుల జాబితాను పొందుపర్చాలని.. ఆ వెబ్‌సైట్‌లో ఉన్న నిందితులకు భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకూడదని తన ఆలోచనను బయటపెట్టారు. హైదరాబాద్‌లో లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారన్న మంత్రి కేటీఆర్.. తన ఆలోచనను ఆచరణలో పెట్టే ఐడియాలలో రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. పోలీసు శాఖలో డ్రోన్ విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు.. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లే లోపే డ్రోన్ ద్వారా దృశ్యాలు సేకరించాలని సూచించారు. ఐటీ పరిశ్రమ తరఫున పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version