కొత్త పార్లమెంట్ భవనం ఎలా ఉండబోతుందంటే..!?

-

ఓ వైపు రైతులు 16 రోజులుగా ఢిల్లీ శివార్లలో చలిలో నిరసనలు చేస్తుంటే మరోవైపు మీరు ప్యాలస్ లు కట్టుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాప చేశారు. గురువారం ఉదయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటేలా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించనున్నారు. అత్యాధునిక వసతులతో, కట్టుదిట్టమైన భద్రతతో లోక్ సభ, రాజ్య సభ, పార్లమెంట్ సెంట్రల్ హాల్ కొలువుదీరనున్నాయి. లోక్ సభ పైకప్పును పురివిప్పిన నెమలి ఆకారంలో, రాజ్య సభ పైకప్పును కమలం ఆకారంలో నిర్మించనున్నారు.

Modi-Bhommi-Pooja

భారతీయ చిత్రకళ, సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుగా కొత్త పార్లమెంట్ భవనం ఉండనుంది. ప్రజల పార్లమెంట్ గా అభివర్ణిస్తున్న ఈ పార్లమెంట్ భవన నిర్మాణాన్ని 2022 ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని సంకల్పించారు. ఆ సమయానికి దేశం 75వ స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకోనుంది. ఈ అరుదైన సందర్భానికి గుర్తుగా కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకోనుంది. భారతదేశ ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింపజేసేవిధంగా కొత్త భవనం ఉండబోతుందని ప్రధాని మోదీ తెలిపారు.

ఇక వారు తమ హక్కులకోసం వీధుల్లో పోరాటం చేస్తుండగా సెంట్రల్ విస్టా పేరిట మీరు ప్యాలస్ లు నిర్మించడం చరిత్రలో ఓ రికార్డుగా నిలిచిపోతుందని, ప్రజాస్వామ్యంలో మీ ఇష్టాలు తీర్చుకోవడానికి అధికారమన్నది ఓ కారణం కాదని సూర్జేవాలా పేర్కొన్నారు. అది ప్రజాసేవకు, ప్రజా సంక్షేమానికి మీడియం వంటిదన్నారు. పార్లమెంట్ అంటే మోర్టార్, స్టోన్స్ కాదు, ఇది డెమొక్రసీకి ప్రతిరూపం, ఇది రాజ్యాంగానికి నిదర్శనం, ఇది 130 కోట్ల మంది భారతీయుల ఆశయం అని పేర్కొన్నారు. ఈ విలువలను పక్కన బెట్టి విలాసవంతమైన భవనం నిర్మించడంలో ఔచిత్యం ఉందా అని సూర్జేవాలా ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version