రోజుకు ఎన్ని గుడ్లను తినవచ్చు ? వేసవిలో గుడ్లను తింటే ఏమవుతుంది ?

-

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పౌష్టికాహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిని అత్యుత్తమ పౌష్టికాహారంగా వైద్య నిపుణులు చెబుతారు. కోడిగుడ్లలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్‌ బి12, డి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల మనల్ని అవి ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే గుడ్లను తినడం మంచిదే అయినప్పటికీ చాలా మందికి నిత్యం ఎన్ని గుడ్లను తినాలో తెలియదు. మోతాదులో తీసుకుంటేనే ప్రయోజనాలు కలుగుతాయి. అధికంగా గుడ్లను తింటే హాని జరుగుతుంది. ఇక నిత్యం ఎన్ని గుడ్లను తింటే మంచిదో వైద్య నిపుణులు చెబుతున్నారు.

కోడిగుడ్లలోని పచ్చని సొనలో 200 మిల్లీగ్రాముల వరకు కొలెస్ట్రాల్‌ ఉంటుంది. నిత్యం మనం 300 మిల్లీగ్రాముల మోతాదులో కొలెస్ట్రాల్‌ను తీసుకోవచ్చు. కనుక రోజుకు ఒకటిన్నర గుడ్డ వరకు తినవచ్చు. అయితే పచ్చ సొన తీసేస్తే తెల్లసొన గుడ్లు రెండు వరకు తినవచ్చు.

అయితే రోజుకు ఒకరు ఎన్ని గుడ్లను తింటే మంచిది ? అన్న విషయంపై ఇప్పటికీ నిపుణులు సరైన సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండరు. అలాగే అందరి శరీరం ఒక్కలా ఉండదు. వేర్వేరుగా ఉంటుంది. అందువల్ల ఒకరు రోజుకు ఎన్ని గుడ్లను తినవచ్చు ? అనే విషయంపై స్పష్టత లేదు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం రోజుకు ఒక గుడ్డును తినవచ్చని, దీంతో ఆరోగ్యంగా ఉంటారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం రోజుకు మూడు గుడ్లను తినవచ్చని చెబుతున్నారు.

ఇక కోడిగుడ్లు సహజంగానే శరీరంలో వేడిని పెంచుతాయి. అందువల్ల వేసవిలో వీటిని ఎక్కువగా తినరాదు. తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. విరేచనాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన మేర, నిర్దిష్టమైన సమయంలో మాత్రమే గుడ్లను తినాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version