తెలంగాం పోలీస్ అకాడమీ లో ఎస్.ఐ. ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ లో 12 వ బ్యాచ్ 1162 మంది ఎస్.ఐ ల పాసింగ్ అవుట్ పరేడ్ ప్రారంభం అయింది. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ లో సివిల్ కు చెందిన 661 ఎస్.ఐ. లు, ఐ.టీ, కమ్యూనికేషన్ కు చెండీన 28, 448 ఆర్.ఎస్.ఐ. లు, ఫింగర్ ప్రింట్ కు చెందిన25 ఏ.ఎస్.ఐ లున్నారు ఉన్నారు అని ప్రభుత్వం పేర్కొంది.
వీరిలో 256 మంది మహిళా ఎస్సైలు ఉన్నారని తెలిపింది. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిధిగా హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ హాజరు అయ్యారు. అలాగే డీజీపీ ఎం. మహేందర్ రెడ్డితో పాటుగా సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే ఎస్సైల కుటుంబ సభ్యులు కూడా వచ్చారు.