గ్రేటర్‌లో రెండోరోజు కేంద్రబృందం పర్యటన..నష్టాన్ని అంచనా వేస్తున్న సెంట్రల్ టీమ్

-

తెలంగాణలో రెండోరోజు కేంద్ర బృందం పర్యటన కొనసాగుతంది..నిన్న హైదరాబాద్‌, సిద్ధిపేటలో పర్యటించి వరద నష్టంపై అంచనా వేసింది సెంట్రల్‌ టీమ్..ఇవాళ ఎల్బీనగర్‌,రాజేశ్వరీనగర్‌లో పర్యటిస్తుంది..వరదలతో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది..ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కేంద్ర బృందం ప్రతినిధులు సమావేశమయ్యారు..తెలంగాణలో భారీ వర్షాలు సృష్టించిన విపత్తు నష్టంపై సెంట్రల్ టీమ్ అంచనాలు సిద్దం చేస్తుంది.

భారీ వర్షాలతో అల్లాడిపోయిన గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుంది..కేంద్ర బృందం పర్యటన మొదటి రోజు చార్మినార్‌ జోన్‌ పరిధిలోని ప్రాంతాల్లో జరిగింది. చాంద్రాయణగుట్టకు వెళ్లిన అధికారులు ఫలక్‌నుమా వద్ద దెబ్బతిన్న ఆర్‌వోబీని, పక్కనే ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. మొదటి అంతస్తుల్లోకీ నీళ్లు వచ్చాయని, కట్టుబట్టలతో మిగిలామని అధికారులకు స్థానికులు వివరించారు. ఇప్పటికీ ఇళ్లలో నీళ్లు ఉన్నాయని, రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు..కేంద్ర బృందంలోని మరో ఇద్దరు అధికారులు రాష్ట్రంలోని ఇతర జిల్లాల సందర్శనకు వెళ్లారు. ఆర్బీ కౌల్‌, కె.మనోహరన్‌.. సిద్దిపేట జిల్లా ములుగు, మర్కుక్‌ మండలాల్లో పంటనష్టాన్ని పరిశీలించారు..పలువురు రైతులతో మాట్లాడి వివరాలను సేకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version