కిడ్నీలో స్టోన్స్‌కు ఇంటి వైద్యం ఎంత వరకు అవసరం.. నిమ్మకాయను వాడొచ్చా..?

-

కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలియగానే చాలామంది కంగారు పడతారు. సరైన జీవనశైలి పాటించకపోవడం కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి. అందులో ఇదీ ఒకటి. కిడ్నీలో రాళ్లు అనేది ప్రాణాంతకం ఏం కాదు. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా రాళ్లను కరిగించుకోవచ్చు. మన తెలంగాణ వాళ్లు అయితే చాలామంది.. కిడ్నీలో రాళ్లు తగ్గేందుకు కల్లు తాగుతారు.! అనాదిగా పాటిస్తున్న పద్దతి ఇది. ప్రయోజనం లేకుండా ఈరోజికీ ఎందుకు వాడతారు.? ఇంకా ఇలాంటి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటి..? ఇంటి చిట్కాలను ఎంతవరకూ వాడొచ్చో ఈరోజు చూద్దాం.!

మీరు మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడానికి నిమ్మ ,ఆపిల్ సైడర్ వెనిగర్‌ను వాడుకోవచ్చు. నిమ్మలోని పదార్థాలు మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్‌లోని యాసిడ్ స్టోన్‌ను కరిగిస్తుంది. రెండూ వాడితే కిడ్నీ స్టోన్ కరిగి తగ్గిపోయి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఈ రెమెడీ చేయడానికి, ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మకాయను పిండండి. ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్తో కలపండి. ఈ డ్రింక్‌ను రెగ్యులర్‌గా తాగడం వల్ల మీ కిడ్నీ స్టోన్ సమస్య తగ్గతుంది.

ఇంకో చిట్కా…నిమ్మకాయతో పాటు, ఔషధ గుణాలు కలిగిన తులసి కూడా కిడ్నీలో రాళ్లను తొలగించటడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గోధుమ గడ్డి లభిస్తే అది కూడా వాడుకోవచ్చు. ఇంకా గోధుమ గడ్డి రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. బాడీలో బ్లడ్‌ తక్కువగా ఉన్నవారు గోధుమగడ్డితో చేసిన జ్యూస్‌ తాగితే చాలు..రక్తమే రక్తం! ఇంకా ఈ రసంలో నిమ్మరసం ఒక టీ స్పూన్, తులసి రసం ఒక టీ స్పూన్‌ వేశారంటే..స్టోన్స్‌ దెబ్బకు కరిగిపోతాయి. ప్రతిరోజూ ఉదయం మూత్ర విసర్జనకు ముందే ఈ పానీయం తాగాలని మాత్రం గుర్తుపెట్టుకోండే.

ఈ రెండు చిట్కాల ద్వారా కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గించుకోవచ్చు. కిడ్నీ స్టోన్ అనేది తీవ్రమైన సమస్య. ఈ ఇబ్బంది ఘోరంగా ఉంటుంది. సమస్య తేలికపాటిది అయితే ఈ చిట్కాల ద్వారా తగ్గిపోతుంది. కానీ ఎక్కువగా ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సిందే. రాయి సైజు ఎక్కువగా ఉన్నా లేక ఎక్కువ రాళ్లు ఉన్నా ఇంటి చిట్కాల కంటే త్వరగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స మొదలుపెట్టుకోవాలి. మన బాడీలో కిడ్నీలు సైజ్‌ చిన్నది అయినా వాటి అవసరం ఎక్కువ. ఒక్కసారి అవి రిపేర్‌కు వచ్చాయంటే..తిరిగి నార్మల్‌ స్టేజ్‌కు రాలేవు. పగిలిన అద్దాన్ని అతికించి వాడుకున్నట్లే..! కాబట్టి ముందు నుంచే కిడ్నీల ఆరోగ్యం మీద శ్రద్ద అవసరం. చాలామంది వివిధ కారణాలు వల్ల టాయిలెట్‌ను ఆపుకుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. కిడ్నీలు దెబ్బతింటానికి ఇదీ ఒక కారణం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version