పర్సనల్ లోన్స్ పై ఏ బ్యాంక్ ఎంత వడ్డీ వసూలు చేస్తోందంటే..!

-

చాలా మంది అవసరానికి చేతిలో డబ్బులు లేవంటే పెర్సనల్ లోన్ ని తీసుకుంటూ వుంటారు. అలానే ఎక్కువ వడ్డీకి రుణం తీసుకోవడం కంటే మీకు ఖాతా ఉన్న బ్యాంక్ నుంచి పర్సనల్‌ లోన్ తీసుకోవడం మంచిది. మాములుగా అయితే ఈ పెర్సనల్ లోన్ పై వడ్డీ రేటు 10.25% నుంచి 36% వరకు ఉంటుంది. లోన్ తీసుకోవాలంటే మీ బ్యాంక్, రుణ రకం, క్రెడిట్ స్కోర్, ఇప్పటికే ఉన్న రుణం, ఆదాయం, రుణ మొత్తం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.

 

money

అయితే అన్ని బ్యాంకులు లో ఒకే వడ్డీ రేటు ఉండదు. మరి ఏ బ్యాంక్ ఎలా ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేటు11%నుంచి స్టార్ట్ అవుతుంది. రుణ మొత్తంలో1.5% వరకు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న 1 నుంచి 12 నెలల్లోపు డబ్బు తిరిగి చెల్లించకపోతే 5 శాతం పెనాల్టీ విధిస్తారు.

అదే బజాజ్ ఫిన్‌సర్వ్ అయితే వడ్డీ 11.49 శాతం నుంచి మొదలవుతుంది. రుణ మొత్తంలో 4% ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 10.50 శాతం నుంచి స్టార్ట్ అవ్వగా.. రుణ మొత్తంలో 2% ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో అయితే 9.55 శాతం నుంచి మొదలు అవుతుంది.

రుణ మొత్తంలో 1% ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అదే సెంట్రల్ బ్యాంక్ లో అయితే ఇది 8.45 శాతం వడ్డీతో మొదలవుతుంది. ఇందులో, రూ. 5000 వరకు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అలానే సిటీ బ్యాంక్ వ్యక్తిగత రుణం 9.99% నుంచి మొదలవుతుంది. ఫెడరల్ బ్యాంక్ 10.49 శాతం వడ్డీ రేటు తో ఇవ్వగా.. HDFC బ్యాంక్ వ్యక్తిగత రుణం 12.50 శాతం నుంచి ఇస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ వ్యక్తిగత రుణం 10.50 శాతం నుంచి ప్రారంభమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version