నిశబ్ధం ఎంత భయంకరంగా ఉంటుందో చెబుతున్న జగన్!

-

జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచి ప్రెస్ మీట్ లు పెట్టి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం.. అయినదానికీ కానిదానికీ పనిమానుకుని మీడియా ముందుకొచ్చి పంచాయితీలు పెట్టడం చేయడం లేదనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే… ఆ మౌనమే జగన్ కు బలం కాగా.. ఆ మౌనం వెనక పరమార్థం అర్థం కాక ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పడుతున్నాయి.. ఫలితంగా విజయం జగన్ ని వరుస్తుంది!

సమస్య పెద్దదైనా, చిన్నదైనా… పనిచేసుకుపోవడమే తనకు తెలుసు, వంద మాటలు కన్నా ఒక పని మిన్న అని జగన్ నమ్ముతున్నారో ఏమో కానీ… ఆ విధంగా ముందుకు పోతున్నారు. అవును… వైజాగ్ లో ప్రమాధం జరిగింది, ప్రతిపక్షాలు, కమ్యునిస్టులు ప్రమాధం గురింఛి తెలుసుకునేలోపు.. కామెంట్స్ ఏమీ లేకుండా వైజాగ్ వెళ్లి పని పూర్తిచేసుకుని వచ్చేశారు జగన్. జగన్ ఏమీ మాట్లాడలేదు.. సీఎం గా చేసిన పనిగురించి జనం మాట్లాడుకున్నారు.. మౌనాన్నే తమ బాషగా ప్రతిపక్షాలు చేసుకున్నాయి.

వైజాగ్ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. అంతర్వేదిలో రథం దగ్ధం అయిపోతే… ప్రతిపక్షాలు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. జగన్ ఎవ్వరూ ఊహించని విధంగా సీబీఐ ఎంక్వైరీ వేసి.. ప్రతిపక్షాలకు పనిలేకుండా చేశారు. కరోనా విషయంలో కూడా ఆన్ లైన్ ప్రెస్ మీట్ లు పెట్టేవారికి సైతం పనిలేకుండా.. పసలేని విమర్శలు మాత్రమే చేసుకునే స్థాయిలో.. పనులు చేసుకుంటూ వెళ్తున్నారు!

తాజాగా తిరుమల డిక్లరేషన్ విషయంలో.. రకరకాల హడావిడి చేశారు బీజేపీ – జనసేన – టీడీపీ నేతలు. జగన్ నుంచి నో కామెంట్! అవును… అందరి అంచనాలకు భిన్నంగా తన మీద అప్పటివరకు వినిపిస్తున్న విమర్శలకు చెక్ చెబుతూ.. తనదైన శైలిలో మౌనంగా పనిచేసుకుపోతూ రియాక్టు అయ్యారు జగన్. తిరుమలకు చేరుకున్నారు.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించటానికి ముందు నుదుటిన నామాలు పెట్టించుకున్నారు.. పంచె కట్టుకొన్నారు.. పూర్తి సంప్రదాయబద్ధంగా మారారు.. పట్టువస్త్రాల్ని స్వామికి అందజేశారు.

ఫలితంగా నానా హడావిడీ చేసిన అల్లరినంతా తనదైన మౌనంతో, చేతలతో కాం చేసేశారు. అన్యమతస్తులకు డికర్లేషన్ నింపాలన్న వాదనకు చెక్ చెప్పటమే కాదు.. తాను పెట్టుకున్న నామాలతో డిక్లరేషన్ మాట అవసరం రానట్లుగా ఇష్యూను తనదైన శైలిలో తేల్చేశారు. ఈ మౌనమే ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. మాటకు మాట లేదు.. మాట పడకుండా చేతల పాలన చూపిస్తున్నారు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version