బిగ్ బ్రేకింగ్ : అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులకు తెలంగాణ గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణా ప్రభుత్వం ప్రయాణికులకి వరుస శుభవార్తలు అందించింది. ఇప్పటికే రేపటి నుండి హైదరాబాద్ లో అన్ని సిటీ బస్సు సర్వీసులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర, కర్ణాటక అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా కారణంగా మార్చి 22 నుంచి ఆరు నెలలుగా అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు ఆగిపోయాయి. అయితే ఏపీ బస్సు సర్వీసుల మీద ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. ఇక రేపటి నుంచి గ్రేటర్ లో సిటీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

తొలుత 25 శాతం బస్సులు సిటీలో నడపాలి అని నిర్ణయం తీసుకున్నారు. ముందు యాభై శాతం బస్సులు నడపాలని భావించినా ముఖ్యమంత్రి అన్ని సర్వీసులు వద్దని చెప్పడంతో కేవలం 25 శాతం సిటి బస్సులు నడపాలని నిర్ణయ తీసుకున్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో సిటీ బస్సుల తీరుపై అధ్యయనం చేసిన గ్రేటర్ ఆర్టీసీ అధికారులు, ఆ రిపోర్టును సిఎంకు అందజేశారు. ఆ రిపోర్ట్ ప్రకారమే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక రేపట్నుంటి సిటీబస్సులు నడుస్తాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. 25 శాతం బస్సులు నడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం తెలిపారని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version