కోప్పడితే మీ మెదడు చెత్తబుట్టలా మారుతుందని తెలిపే అద్భుతమైన కథ..

-

ఒక వ్యాపారవేత్త హడావిడిగా చేతిలో బ్యాగు పట్టుకుని బయలు దేరాడు. రోడ్డు మీదకి వచ్చి టాక్సీ అని పిలవగానే అతని ముందుకు ఒక టాక్సీ వచ్చి ఆగింది. రోడ్డుకి ఎడమ పక్కగా పార్కింగ్ ప్లేస్ లో ఆగిన టాక్సీకి ముందు మరో కారు ఉంది. దాన్ని దాటి ఎలా వెళ్ళాలా అని చూస్తుండగా, వెనకాల నుండి ఒక కారు వచ్చింది. అది వస్తుందని గమనించిన టాక్సీ డ్రైవర్ తన కారుని ముందుకి పోనిచ్చి సడెన్ గా బ్రేక్ వేసాడు. టాక్సీ జారి ముందున్న కారుకి కొన్ని ఇంచుల దూరంలో ఆగింది. టాక్సీ వెనకాల కారు వెనకాలే ఉండిపోయింది.

టాక్సీ వచ్చి స్పీడుగా వేసిన బ్రేక్ శబ్దానికి ముందు కారులో ఉన్న డ్రైవర్ వెనక్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు కోపంగా అరిచాడు. దానికి టాక్సీ డ్రైవర్ చిన్న నవ్వు నవ్వి ఏం ఫర్లేదులే అంటూ సైగ చేసాడు. ఆ తర్వాత మెల్లగా రోడ్డు మీదకి టాక్సీ ఎక్కింది. ఇదంతా చూసిన బిజినెస్ మేన్, టాక్సీ డ్రైవర్ తో ఇలా అన్నాడు. కారు డ్రైవర్ అలా మాట్లాడుతుంటే ఊరికే ఉన్నావేంటి? ఏం జరక్కముందే అంతలా అరిచాడు. నువ్వెందుకు ఊరుకున్నావు అని అడుగుతాడు. దానికి టాక్సీ డ్రైవర్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.

సార్, నేను అతనిలాగే అరవవచ్చు. కావాలంటే నా తప్పేమీ లేదు కాబట్టి గొడవ పెట్టుకుని పోలీసుల దాకా వెళ్ళవచ్చు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? అతనేదో ఇంట్లో ఇబ్బందుల వల్లనో, పని ఒత్తిడి వల్లనో, తన మెదడునంతా చెత్త నింపుకుని ఉన్నాడు. సమయం రాగానే ఆ చెత్తని మన మీద వేయడానికి సిద్ధపడ్డాడు. నేను నవ్వి నీ చెత్త నాకవసరం లేదని చెప్పాను. లేదంటే అతను వదిలేసిన చెత్తని నా మెదడులో నింపుకుంటే ఏదో ఒక రోజు నిండిన చెత్తని మరో చోట పడవేయాల్సి వస్తుంది.

నా మెదడెప్పుడూ శుభ్రంగా ఉండాలి. అనవసరమైన చెత్త నాకవసరం. అందుకే అలా నవ్వుతూ ఉండిపోయాను. టాక్సీ డ్రైవర్ మాటలకి బిజినెస్ మేన్ షాకయిపోయాడు. ముఖ్యమైన మీటింగ్ కోసమని బయల్దేరిన అతనికి సరికొత్త జీవిత పాఠం నేర్చుకున్నట్టయ్యింది. గమ్యస్థానం రాగానే టిప్పు చెల్లించి ఆనందంగా దిగిపోయాడు. డేర్ తు డూ మోటివేషన్ ఆధారంగా.

Read more RELATED
Recommended to you

Exit mobile version