గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసం…!

Join Our Community
follow manalokam on social media

సాధారణంగా మనకి ఒక్కో సారి అనుకోని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. దీని వల్ల మనకి ఎన్నో బాధలు వస్తాయి. ఎంత మర్చిపోదాం అన్నా దానిని మర్చిపోలేక పోతాము. అయితే వాటిని మరిచిపోయి జీవితాన్ని సంతోషంగా గడపాలి. అయితే మీరు వాటిని అన్ని మర్చిపోవాలి అనుకుంటే ఇలా అనుసరించండి.

గతం నుండి నేర్చుకోవడం:

గతంలో జరిగిన పొరపాటుని, మీకు ఎక్కువ బాధ కలిగే వాటిని తీసుకుని మీరు వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలి. తిరిగి వాటిని మీరు రిపీట్ చేయకుండా.. ఆ విషయాలపై శ్రద్ధ గా ఉండాలి. ఆలా మరోసారి జరగకుండా హ్యాండిల్ చేయాలి.

మీ దృష్టి పెట్టండి:

ఎప్పుడో జరిగిపోయిన వాటిని పదే పదే తలుచుకోవడం మానేయండి. ఇప్పుడు ఈ సమయం పై దృష్టి పెట్టండి. లేదంటే ఈ సమయాన్ని కూడా మీరు చేతులారా నాశనం చేసుకోవాల్సి వస్తుంది.

మీ పక్కన ఉన్న వాళ్ళ కోసం ఆలోచించండి:

మీరు బాధలో కూరుకు పోతూ ఉంటే మీ పక్కన ఉన్న వాళ్లు కూడా మీ పట్ల బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరు వాళ్ల కోసం కూడా ఒక్కసారి ఆలోచించండి.

మీ బాధని పంచుకోండి:

మీ బాధని మీ స్నేహితులతో లేదా మీ తల్లిదండ్రులతో పంచుకోండి. అంతే కానీ మీ గుండెల్లో బాధను ఆలా పెట్టేసుకుని ఉండి పోకండి. వీలైనంత వరకు దానికి సొల్యూషన్ తేవడానికి ప్రయత్నం చేయండి. అలా నెమ్మదిగా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించండి.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...