ఎలా కొట్టాలో.. అలాగే కొట్టావ్: వీరేంద్ర సెహ్వాగ్

-

రెండో టెస్టులో డ‌బుల్ సెంచ‌రీ చేసిన ఓపెనర్ య‌శ‌స్వీ రాజ్‌కోట్‌లోనూ చెలరేగి ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో సిక్స‌ర్ల‌ వర్షం కురిపిస్తూ రెండో సెంచరీ కొట్టాడు. టీ20 త‌ర‌హాలో ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను ఊచకోత కోశారు .మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఫోర్ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో మూడో సెంచరీ చేశాడు.హాఫ్ సెంచరీ వరకు నెమ్మదిగా ఆడిన ఈ యంగ్ ఓపెనర్ ఆ తర్వాత ఇంగ్లీష్ బౌలర్లపై విజృంభించాడు.

ఇదిలా ఉంటే….. బ్యాటింగ్ సెన్సేషన్ జైస్వాల్ సెంచరీపై డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్లో స్పందించారు. ‘జైస్వాల్ వరుస సెంచరీలు బాదారు. స్పిన్నర్లను ఎలా కొట్టాలో.. అలాగే కొట్టావ్’ అంటూ జైస్వాల్ ఫొటోను సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. యశస్వి కూడా సెహ్వాగ్లా బౌండరీలతో సెంచరీలు పూర్తి చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 104 పరుగులు చేశాక జైస్వాల్ రిటైర్డ్ హర్ట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news