భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మక చేపట్టిన జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగం విజయవంతమైంది. వాతావరణాన్ని అంచనా వేయడం, విపత్తు నిర్వహణకు సేవలు వాడుకోవడం వంటి వాటి కోసం శ్రీహరి కోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇన్శాటి3 డీఎస్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. ఇది విజయవంతంగా మూడు దశలను దాటింది. GSLV-F14 ప్రయోగం సక్సెస్ అయ్యిందని ఇస్రో ఛైర్మన్ సోమ్నాథ్ ప్రకటించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
ఇస్రో ఈ ఏడాది రెండో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈరోజు సాయంత్రం 5.35 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్ డౌన్ మొత్తం 27.5 గంటల పాటు కొనసాగింది. కాగా, జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం. ఈ రాకెట్ 19 నిమిషాల్లో నిర్ణీత అంతరిక్ష కక్ష్యకు చేరేలా ప్రణాళికలు రూపొందించగా ,అనుకున్న సమయం ప్రకారమే శాటిలైట్ అన్ని దశలను దాటుకుంటూ విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. ఈ ఉపగ్రహ బరువు 2,275 కిలోలు.