ఈ బిర్యాని ట్రై చేసారా ఎప్పుడైనా…?

-

5 పచ్చిమిర్చి పేస్ట్,1 ఉల్లిపాయ పేస్ట్, 6 ఎండుమిర్చి పేస్ట్ విడి విడిగా వేటికి అవి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి… కుక్కర్ గిన్నె లో 2 గరిటె నూనె 4 స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక అందులో బిర్యాని సామాన్లు వేసి వేగాక దాన్లో పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలిపి 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి.

దీన్లో చికెన్ ముక్కల్ని వేసి బాగా కలిపి 1/2 స్పూన్ పసుపు 1 1/2 స్పూన్ ఉప్పు,1 స్పూన్ ధనియాల పొడి,1/2 స్పూన్ కారం కూడా వేసి బాగా వేగనివ్వాలి…. మాంసం బాగా మగ్గిన తర్వాత ఎండుమిర్చి ముద్ద,1 గరిటె పెరుగు,1 నిమ్మకాయ రసాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టాలి…5 నిమిషాల తర్వాత గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు,పుదీనా,గుప్పెడు,మెంతి కూర వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మాంసం బాగా మగ్గి మసాలా అంతా బాగా కలిసి మంచి వాసన వస్తూ నూనె పైకి తేలాక 2 గ్లాస్ ల నీళ్ళు పోసి మరగనివ్వాలి…నీళ్ళు మరిగాక మంట తగ్గించి కడిగిన 1 గ్లాస్ బియ్యం దాన్లో వేసి బాగా కలిపి మూత పెట్టాలి… కుక్కర్ గిన్నె ఇప్పుడు కరెంట్ కుక్కర్ లోకి పెట్టీ బిర్యాని రెడీ అవ్వనివ్వాలి…

Read more RELATED
Recommended to you

Latest news