కావాల్సినవి :
క్రీమ్ చీజ్ : 400 గ్రా.
చక్కెర : 700 గ్రా.
చాకొలెట్ : 1 కిలో
వనీల్లా : 3 టీస్పూన్లు
వాల్‌నట్స్, కొకొవా, కొకోనట్, ఐసింగ్ షుగర్ : సరిపడా
తయారీ :
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో క్రీమ్ చీజ్ వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. తర్వాత చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్స్‌లో చాకొలెట్, వనీల్లా కరిగేవరకు ఉంచాలి. క్రీమ్‌చీజ్, చాక్లెట్ మిశ్రమం రెండింటినీ కలిపి గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. బయటకు తీసిన తర్వాత 3 సెంటీమీటర్ల సైజులో బాల్స్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని వాల్‌నట్స్, కొకోవా, కొకోనట్, ఐసింగ్ షుగర్‌తో కలిపి రోల్ చేసుకుంటే చాకొలెట్ ట్రఫ్ తయారయినట్లే..