నాంపల్లిలో ఉన్న తెలంగాణ బీజేపీ కార్యాలయం పైన యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేసారు. దాంతో అకాడ హర్షణ వార్తవరణం చోటు చేసుకుంది. రక్తం వచ్చేలా కొట్టుకున్నారు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు. ఇందులో ఓ బీజేపీ దళితామోర్చా కార్యకర్త తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు దిగడం వల్ల.. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తుంది.
అయితే ఇటీవల ప్రియాంకా గాంధీపై బీజేపీ నేత రమేశ్ బిధురి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిందే. ప్రియాంకా గాంధీ ఆమె బుగ్గల తరహాలో.. నున్నగా రోడ్లు వేయిస్తానంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేసారు రమేశ్. దీని పైన నిన్న ఢిల్లీలోని కాంగ్రెస్ పేదలు విమర్శలు చేయగా.. ఈ రోజు తెలంగాణలో బీజేపీ ఆఫీస్ ముట్టడికి వచ్చారు యూత్ కాంగ్రెస్. ఈ క్రమంలోనే వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలయ్యింది. దాంతో కోడిగుడ్లు, రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు కార్యకర్తలు.