సూర్యగ్రహణం ఎక్కడెక్కడ కన్పిస్తుంది విశేషాలు ఇవే !

-

స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య తేదీ డిసెంబర్ 26 గురువారం 2019 న సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. “ధనస్సు” రాశి మూల నక్షత్రం “మకర , కుంభ” లగ్నాలలో కేతుగ్రస్త కంకణ సూర్య గ్రహణం సంభవించును.ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా , ఆస్ట్రేలియా ఖండాలలో కనబడును .ఖగోళంలో ఈ గ్రహణం 3 గంటల 39 సెకండ్లు ఉంటుంది. కర్ణాటక , తమిళనాడు ,కేరళలోని కొన్ని ప్రాంతాలలో కంకణోక్త సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాలలో ఉండును .

పై మూడు రాష్టాలు మినహాయించి మిగిలిన తెలంగాణ, ఆంద్రప్రదేశ్ తో పాటు భారతదేశంలోని ఇతర రాష్టాలన్నింటిలో పాక్షిక సూర్యగ్రహణం గోచరిస్తుంది. హైదరాబాదులో ఉదయం 8 :08 నిముషాలకు సూర్యగ్రహణ స్పర్శ ప్రారంభమై మధ్యకాలం 9:30 చేరుకుంటుంది. ఉదయం 11 :11 నిమిషాలకు ” పుణ్యకాలం ” ముగుస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుడు అగ్నివలయంలాగా గ్రహణం చుట్టూ కనపడతాడు. కేరళలోని చెరువుత్తూర్ లో దేశంలో అన్ని ప్రాంతాల్లో కంటే సూర్య గ్రహహణ దృశ్యం సుందరంగా ఉండబోతోంది.

ప్రపంచంలో అతికొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇంత స్పష్టంగా సూర్యగ్రహణం కనిపిస్తుంది. సూర్యగ్రహణం వీక్షించే సమయంలో అద్దాలు లేకుండా కంటితో చూడవద్దని హెచ్చరిక . సూర్యుడికి , భూమికి మధ్య చంద్రుడు ప్రవేశించడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుడికి మధ్యలో నుండి అంచులో అగ్నివలయంలాగా కనిపిస్తాడు. భారతదేశంలోనే కాకుండా , సౌదీ అరేబియా, సుమత్రా, బార్నియో లాంటి ప్రాంతాల్లో కూడా సూర్య గ్రహణం దర్శనమిస్తుంది.

 

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news