కామారెడ్డి.. బాన్సువాడలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. అక్కడ ఎక్సైజ్ నూతన భవనం ప్రారంభించిన మంత్రి జూపల్లి అనంతరం కీలక కామెంట్స్ చేసారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది అని పేర్కొన ఆయన.. అసలు కేటీఆర్ తప్పు చేయకుంటే కోర్టుకు ఎందుకు వెళ్లాడు అని ప్రశ్నించారు. ఈ కేసును కేటీఆర్ ఎదుర్కోవాలి.. ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలి, హాజరు కావాలి అని స్పష్టం చేసారు.
అలాగే బీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. కానీ తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయింది. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది ఓ కల. కాకపోతే రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ నాయకులు బురదజల్లుతున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.