వీటితో మీ శ‌రీరం కొవ్వును క‌రిగించే మెషిన్‌లా మారిపోతుందంతే.. ట్రై చెయ్యండొకసారి

-

మ‌న శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌ర‌గాలంటే.. అధికంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయాలన్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే చాలా మంది నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు.. ప‌లు ర‌కాల పోషకాలు ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటుంటారు. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే.. దాంతో శ‌రీర మెట‌బాలిజం బాగా పెరుగుతుంది. ఈ క్ర‌మంలో శరీరం అధికంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తుంది. ఫ‌లితంగా కొవ్వు క‌రిగి, అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. మ‌రి మెట‌బాలిజంను పెంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

* మ‌న శ‌రీర మెట‌బాలిజంను పెంచి అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో తేనె బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 లేదా 2 టీస్పూన్ల తేనె క‌లుపుకుని తాగితే శ‌రీరం మెట‌బాలిజం పెరుగుతుంది. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది.

* ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాలు చేయ‌డానికి క‌నీసం 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి. దీంతో శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. శ‌రీరంలో క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌యి.. బ‌రువు త‌గ్గుతారు.

* నిత్యం ఆహారంలో గోధుమ‌లు, జొన్న‌లు, స‌జ్జ‌లు, రాగులు త‌దిత‌ర ధాన్యాల‌తో చేసిన ఆహారాల‌ను భాగం చేసుకోవాలి. దీని వ‌ల్ల కూడా శ‌రీర మెట‌బాలిజంను పెంచుకోవ‌చ్చు.

* మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసే స‌మ‌యంలో వెనిగ‌ర్‌ను తీసుకుంటే.. మెట‌బాలిజం పెరుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

* మ‌న శ‌రీర మెట‌బాలిజంను ఎక్కువ‌గా పెంచ‌డంలో గ్రీన్ టీ అద్భుతంగా ప‌నిచేస్తుంది. నిత్య 2 క‌ప్పుల గ్రీన్ టీని తాగితే శ‌రీరం కొవ్వును క‌రిగించే యంత్రంలా మారుతుంది. అధిక బ‌రువు చాలా త్వ‌ర‌గా త‌గ్గుతారు.

* నిత్యం సాధారణ నీటిని కాకుండా గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

* బీట్‌రూట్‌లో కొవ్వును క‌రిగించే పోష‌కాలు ఉంటాయి. నిత్యం బీట్‌రూట్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెటబాలిజం పెరిగి అధిక బ‌రువు త‌గ్గుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version