వర్షాకాలం.. కరోనా ముప్పు.. జనాల్లో భయం.. సురక్షితంగా ఉండేందుకు ఏం చేయాలి..?

-

దేశంలో రోజు రోజుకీ భారీగా నమోదవుతున్న కరోనా కేసులు జనాలను భయపెడుతున్నాయి. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గనప్పటికీ కేంద్రం లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ వస్తోంది. ఇది జనాలను మరింత భయాందోళనలకు గురి చేస్తోంది. ఇక దీనికి తోడు వర్షాకాలం రానేవచ్చింది. దీంతో కరోనా ముప్పుపై జనాల్లో ఇంకా ఎక్కువ భయం, ఆందోళన కలుగుతున్నాయి.

తేమగా ఉండే వాతావరణంలో కరోనా వైరస్‌ ఎక్కువ సేపు జీవించి ఉంటుందని గతంలోనే సైంటిస్టులు చెప్పారు. ఇక వర్షాకాలంలో ఎక్కడ చూసినా నీరు ఉంటుంది కనుక.. ఆ నీటిలో కరోనా వైరస్‌ నెమ్మదిగా క్షీణిస్తుంది. ఇది కూడా మనకు ప్రమాదకరమే. దీంతో ఈ వైరస్‌ పట్ల జనాలు ఇప్పుడు మరింత భయపడుతున్నారు. ఈ సీజన్‌లో వైరస్‌ నుంచి ఎలా తప్పించుకోవాలా ? అని ఆందోళన చెందుతున్నారు. ఇక రహదారులపై ప్రయాణించే వారు ఉన్నట్టుండి వర్షం పడితే తమకు సమీపంలోని చెట్లు లేదా ఏదైనా షెల్టర్‌లో కాసేపు తలదాచుకుంటారు. అలాంటి చోట్ల ప్రస్తుతం కరోనా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం కుదరదు. మరోవైపు వర్షంలోనూ తడవలేరు. మరి ఇందుకు ఏం చేయాలి ? అనే విషయంపై అటు వాహనదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. అలాగే మాస్కులు తడిస్తే వాటిని మళ్లీ వాడే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఇన్ని ప్రతికూల అంశాల నడుమ బయట ఎలా కాలుపెట్టి తిరగగలం అని జనాలు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇందుకు వైద్యులు పలు సలహాలు చెబుతున్నారు. అవేమిటంటే…

* నిరంతరాయంగా మాస్కులను ధరించడం వల్ల శరీరానికి ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. దీన్ని అధిగమించేందుకు శ్వాస వ్యాయామాలు చేయాలి. సుదీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలే వ్యాయామం చేస్తే.. శరీరానికి ఆక్సిజన్‌ సరఫరాను పెంచవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
* సలైన్‌ వాటర్‌ను గొంతులో పోసుకుని పుక్కిలించాలి. ఆ వాటర్‌ వైరస్‌లను నాశనం చేసి గొంతు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
* ఆవనూనె వంటి నూనెలతో ముక్కును క్లీన్‌ చేయాలి. లోపలివైపు ఆ నూనెను వాడాలి. దీంతో ముక్కు రంధ్రాల్లో చేరే వైరస్‌లు నశిస్తాయి.
* వర్షాకాలంలో తడిచిన మాస్కులను అస్సలు వాడరాదు
* బయటకు వెళ్లినప్పుడు, దేన్నయినా టచ్‌ చేసే ముందు, చేశాక కచ్చితంగా శానిటైజర్‌ వాడాలి.
* గాయాలను యాంటీ సెప్టిక్‌తో క్లీన్‌ చేసుకోవాలి.
* వాషబుల్‌ మాస్కులను బాగా ఉతికి పూర్తిగా ఎండిన తరువాత మాత్రమే వాడాలి.
* తడిచిన, ఒక్కసారి మాత్రమే వాడాల్సిన మాస్కులను పడేయాలి.
* వర్షం వల్ల రోడ్డు పక్కన షెల్టర్‌లో ఇతరులతో కలిసి నిల్చోవాల్సి వస్తే ఎవరితోనూ మాట్లాడకూడదు.
* ఆ సమయంలో ముక్కు, ముఖం, కళ్లను టచ్‌ చేయరాదు.
* చీదడం కూడా మానేయాలి.
* ఇతరులను ఎవరిని టచ్‌ చేయవద్దు.
* వీలైనంత వరకు భౌతిక దూరం పాటించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version