పుష్ప-2 విడుదల ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపులాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చివరో రోజు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయగా.. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ పై ఆంధ్రప్రదేశ్
బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ప్రేరేపితం కాదని.. ఊహించని పరిణామంతో జరిగిందని అన్నారు. ఓ హీరోగా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లారని తెలిపారు. కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా.. A11గా ఉన్న అల్లు అర్జునన్ను మాత్రమే అరెస్ట్ చేయడం సరికాదని పురందేశ్వరి పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.