ఎలా అయితే వైద్యులు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ని బతికించారు. గత నెల రోజులుగా ఆమె కరోనా వైరస్ తో పోరాడుతున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వృద్దులు కరోనా వైరస్ నుంచి బయటపడుతున్నా ఆమె మాత్రం అలాగే బాధపడటం తో ఆమె చనిపోయే అవకాశాలు ఉన్నాయని, ఆమెకు కరోనా తగ్గే అవకాశం లేదని లోపల అన్ని అవయవాలను కరోనా వైరస్ నాశనం చేస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆమె కరోనా కారణంగా మరణించినా వైద్యులు చెప్పడం లేదని కూడా అన్నారు. ఆమెకు 5 సార్లు కరోనా పరిక్షలు చేసారు వైద్యులు. ఈ 5 సార్లు కూడా ఆమెకు పాజిటివ్ రావడంతో పరిస్తితి ఏంటో అర్ధం కాలేదు. ఇప్పుడు ఆరోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆమెకు నెగటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆమె త్వరలో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఒక కార్యక్రమం కోసం లండన్ వెళ్ళిన ఆమెకు కరోనా వైరస్ సోకింది. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు ఐదోసారి నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ రిపోర్టు వచ్చింది. మరోసారి పరీక్షల్లో నెగిటివ్ వచ్చే వరకు ఆమెకు లక్నోలోని పీజీఐ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని ఆమెకు చికిత్స చేసిన వైద్యులు మీడియాతో చెప్పారు. కపూర్‌కు మార్చి 20న తొలిసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది.