ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇలా రెన్యువ‌ల్ చేసుకోండి..!

-

కరోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అన్ని ర‌కాల సేవ‌ల‌ను ఆన్‌లైన్‌లోనే ప్ర‌భుత్వాలు అందిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రోడ్డు ర‌వాణాకు సంబంధించి ప‌లు సేవ‌లు కూడా ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువ‌ల్ ఒక‌టి. గ‌తంలో లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎక్స్‌పైర్ అయిన డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇత‌ర ప‌త్రాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గడ‌వును పెంచుతూ వ‌చ్చింది. కానీ ఇప్పుడు వాటిని త‌ప్ప‌క రెన్యువ‌ల్ చేసుకోవాల్సి వ‌స్తోంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్‌ను మాత్రం ఆన్‌లైన్‌లోనే రెన్యువ‌ల్ చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..

ర‌వాణా శాఖకు చెందిన వెబ్‌సైట్‌ను ముందుగా ఓపెన్ చేయాలి. అందులో లైసెన్స్ విభాగంలో రెన్యువ‌ల్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. త‌రువాత అందులో సూచించిన విధంగా డ్రైవింగ్ లైసెన్స్ నంబ‌ర్‌, ఇత‌ర వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి ఓటీపీ ద్వారా వివ‌రాల‌ను క‌న్‌ఫాం చేయాలి. అనంత‌రం ప‌లు డాక్యుమెంట్ల‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో కొన్ని రోజుల్లోనే రెన్యువ‌ల్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ పోస్ట్ ద్వారా ఇంటికి వ‌స్తుంది.

ఇక ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువ‌ల్ చేసేందుకు పూర్తి చేసిన అప్లికేష‌న్ ఫాం, ఫాం 1ఎ (40 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి మెడిక‌ల్ స‌ర్టిఫికెట్‌), ఎక్స్‌పైర్ అయిన ఒరిజిన‌ల్ డ్రైవింగ్ లైసెన్స్‌, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు కావ‌ల్సి ఉంటుంది. అప్లికేష‌న్ ఫాంను డౌన్‌లోడ్ చేసి నింపి దాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అలాగే మిగిలిన ప‌త్రాల‌ను కూడా అప్‌లోడ్ చేయాలి. ఈ క్ర‌మంలో వివ‌రాల‌న్నీ స‌రిగ్గా ఉంటే 7 నుంచి 15 రోజుల్లో రెన్యువ‌ల్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికి వ‌స్తుంది.

సాధార‌ణంగా డ్రైవింగ్ లైసెన్స్‌కు కాల ప‌రిమితి 20 ఏళ్లు ఉంటుంది. ఎక్స్‌పైర్ అయ్యాక 30 రోజుల్లోగా రెన్యువ‌ల్ చేసుకోవాలి. అయితే నాన్ ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్‌ను 5 ఏళ్ల పాటు రెన్యువ‌ల్ చేస్తారు. ట్రాన్స్ పోర్ట్ లైసెన్స్ అయితే 3 ఏళ్ల వ‌ర‌కు రెన్యువ‌ల్ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version