పెట్రోల్ రేటు పెరిగినా మీ జేబుకి చిల్లు పడదు ఎలాగో తెలుసా..!!!

-

దేశంలో ఎలాంటి వస్తువుల రేటు పెరిగినా సరే మనం పెద్దగా పట్టించుకోము. కానీ పెట్రోల్ ధరలు పెరిగితే మాత్రం తీవ్రంగా స్పందిస్తాం. జేబులు గుల్ల చేస్తోంది ప్రభుత్వం అంటూ తిట్టిపోస్తాం. తిట్టకూడని తిట్లు అన్నీ తిట్టేసి తప్పదుకదా అంటూ మనలో మనకి సర్ది చెప్పుకుంటాం. ప్రజా సంఘాలు అయితే ధర్నాలు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సరే పెట్రోల్ రేటు పెంపు, తగ్గింపు అనేది మనచేతిలో ఉండేది కాదు. కానీ సరైన పద్దతిలో బండి నడిపితే పెట్రోల్ ని ఆదా చేసుకోవచ్చు. మరి అదెలాగో చూద్దాం.


బండి నడిపే సమయంలో చాలా మంది స్పీడుగా వెళ్తారు. తొందరగా గమ్యాన్ని చేరుకోవడానికి కానీ గమ్యం చేరుకోవడం పక్కన పెడితే అదుపు తప్పితే మాత్రం ఏ గమ్యం చేరుకుంటామో ఎవరికీ తెలియదు. అదలా ఉంచితే ఓవర్ స్పీడుగా వెళ్తే పెట్రోల్ కూడా అదే స్పీడుగా ఖాళీ అవుతుంది. అందుకే నెమ్మదిగా వెళ్ళడం రెండు విధాలుగా మంచిది.

ఎమిషన్ టెస్ట్ చేయించినా కూడా పెట్రోల్ ఆదా అవుతుంది, అలాగే పదేపదే గేర్లు మార్చడం వలన కూడా పెట్రోల్ ఎక్కువగా ఖర్చు అవుతుంది. మీ బండి టైర్లు కండిషన్ లో ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి ఎందుకంటె టైర్లు బాగా అరిగిపోతే భారంగా బండి వెళ్తుంది కాబట్టి పెట్రోల్ కూడా అధికంగా బండి తీసుకుంటుంది.

నిపుణులు సూచించే మోటార్ ఆయిల్ వాడటం ఉత్తమం. అలాగే ఒకే స్పీడులో వాహనాన్ని నడుపుతూ ఉండాలి. అంతేకాదు పెట్రోల్ అనేది ఉదయం పూట కొట్టించుకోవడం ఉత్తమం.బండి ఎప్పటికప్పుడు కండిషన్ లో ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు అన్నీ పాటిస్తే తప్పకుండా మీరు పెట్రోల్ ఆదా చేసుకున్నట్టే. డబ్బులు ఆదా అయినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news