క్రెడిట్ కార్డుని ఉపయోగిస్తూ ఉంటారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి…!

-

ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డుని ఉపయోగిస్తూ షాపింగ్ చెయ్యడం, ఏదైనా వస్తువులని కొనుగోలు చెయ్యడం ఇలా ఎవరికి నచ్సినట్టు వాళ్ళు వాడుతున్నారు. మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీరు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. వివరాల లోకి వెళితే… క్రెడిట్ కార్డు లో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. కానీ చాల మందికి ఈ విషయాలు తెలియవు.

credit cards

నిర్లక్ష్యంగా కనుక మీరు ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టకుండా వస్తే మాత్రం నష్టపోవాల్సి వస్తుంది గుర్తుంచుకోండి. క్రెడిట్ కార్డు బిల్లు కచ్చితంగా కడుతూ రావాలి. అలానే క్రెడిట్ కార్డు బిల్లు కరెక్ట్‌ టైమ్‌కు కట్టకపోతే చాల ఇబ్బందులు తలెత్తవచ్చు. వాటిని చూస్తే…. క్రెడిట్ కార్డు బిల్లుని కనుక మీరు ఆలస్యం చేస్తే లెట్ గా కట్టినందుకు ఆలస్య రుసుము కూడా చెల్లించుకోవాలి. ఇవి మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో కలిసి వస్తాయి. పైగా వడ్డీ భారం కూడా తప్పదు గమనించండి.

60 రోజులు దాటిన తర్వాత కూడా మీరు బిల్లు కట్టకపోతే మాత్రం వడ్డీ రేట్లు పెరుగుతాయి. కరెక్ట్ టైమ్ కి కట్టకపోతే ఆ విషయం క్రెడిట్ బ్యూరోలకు చేరుతుందని అధికారులు చెప్పడం జరిగింది. క్రెడిట్ స్కోర్‌పై ఏడేళ్లు ఎఫెక్ట్ ఉంటుంది. ఆలస్య రుసుము చెల్లిస్తే రివార్డు పాయింట్లు కూడా కోల్పోతారు. మీరు కనుక 180 రోజులు దాటినా కూడా క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే మీ అకౌంట్ ను మొండి బకాయి కిందకు పరిగణిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version